నోయిడా: ప్రొ కబడ్డీ సీజన్-11లో భాగంగా బుధవారం జరిగిన పోటీల్లో హర్యానా స్టీలర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. షాహిద్ విజరు సింగ్ పాఠక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పుణేరి పల్టన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యానా జట్టు 38-28 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. హర్యానా జట్టులో శివమ్(13) రైడ్స్‌లో రాణించగా.. మహ్మద్రేజ్(5), వినరు(4) ట్యాకిల్స్‌లో రాణించారు. హర్యానా జట్టు రైడ్స్‌లో నిరాశపరిచినా.. ట్యాకిల్స్‌లో అద్భుతంగా రాణించింది. ఆ జట్టు రెండుసార్లు పుణేరి జట్టును ఆలౌట్ కూడా చేసింది. పుణేరి జట్టులో పంకజ్ మోహిత్(10), ఆకాశ్ షిండే(9) రైడ్స్‌లో రాణించగా.. మోహిత్, సావంత్ ట్యాకిల్స్‌లో మెరిసాడు.
ప్రొ కబడ్డీలో నేడు..
బెంగాల్ వారియర్స్ × గుజరాత్ జెయింట్స్(రాత్రి 8.00గం||లకు)
యు ముంబ × తెలుగు టైటాన్స్(రాత్రి 9.00గం||లకు)