Pro Kabaddi : జైపూర్‌ గెలుపు

నోయిడా: ప్రొ కబడ్డీ సీజన్‌-11లో జైపూర్‌ పింక్‌ ప్యాంథర్స్‌ జట్టు వరుస పరాజయాలకు బ్రేక్‌ వేసింది. షాహిద్‌ విజరుసింగ్‌ పాఠక్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ సోమవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ జట్టు 37-23పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్స్‌ను చిత్తుచేసింది. జైపూర్‌ జట్టులో అర్జున్‌(16), నీరజ్‌ నర్వాల్‌(5) రైడ్స్‌లో రాణించగా.. రేజా(4), అంకువ్‌(4) ట్యాకిల్స్‌లో మెరిసారు. జైపూర్‌ జట్టు నాలుగుసార్లు పుణేరి జట్టును ఆలౌట్‌ కూడా చేసింది. ఇక పుణేరి జట్టులో పంకజ్‌(7), మోహిత్‌ గోయట్‌(7) రైడ్స్‌లో రాణించగా.. అజిత్‌, సంకేత్‌ ట్యాకిల్స్‌లో మెరిసారు.

➡️