హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-11లో పట్నా పైరెట్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా జట్టు 43-41పాయింట్ల తేడాతో గెలిచింది. పట్నా జట్టులో అయాన్(14), దేవాంక్(11) రైడ్‌లో రాణించగా.. ట్యాకిల్స్‌లో దీపక్, నవ్‌దీప్ మెరిసారు. ఇక జైపూర్ జట్టులో అర్జున్(20) ఒంటరి పోరాటం చేశారు. ట్యాకిల్స్‌లో అంకుశ్, రేజా మాత్రమే రాణించారు. ఇక పట్నా జట్టు రైడ్‌ల ద్వారా 27పాయింట్లు సాధించగా.. జైపూర్ 26పాయింట్లు చేజిక్కించుకుంది. ట్యాకిల్స్‌లో పట్నా 12, జైపూర్ 9పాయింట్లు మాత్రమే సాధించింది. పట్నా 2సార్లు, జైపూర్ 4సార్లు ప్రత్యర్ధి జట్లను ఆలౌట్ చేశాయి.
ప్రొ కబడ్డీలో నేడు…
తెలుగు టైటాన్స్ × పుణేరి పల్టన్స్(రాత్రి 8.00గం||లకు)
బెంగళూరు బుల్స్ × బెంగాల్ వారియర్స్(రాత్రి 9.00గం||లకు)