పూణే: ప్రొ కబడ్డీ సీజ న్-11లో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని చవిచూసిం ది. దబాంగ్ ఢిల్లీతో గురు వారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 27-33పాయింట్ల తేడాతో పరాజయంపాలైంది. టైటాన్స్ జట్టులో విజరు (10), ఆశీశ్(8) రైడ్స్‌లో రాణించగా.. ట్యాకిల్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇక దబాంగ్ ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్(11), ఆషు మాలిక్(9) రైడ్స్‌లో రాణించగా.. ట్యాకిల్స్‌లో యోగేశ్, ఆశీశ్ మెరిసారు. ఇక ఢిల్లీ జట్టు నాలుగుసార్లు టైటాన్స్‌ను ఆలౌట్ చేయగా.. టైటాన్ జట్టు రెండుసార్లు మాత్రమే ఢిల్లీని ఆలౌట్ చేయగల్గింది. యుపి యోథా- బెంగాల్ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ 31-31పాయింట్లతో డ్రా అయ్యింది.
ప్రొ కబడ్డీలో నేడు…
తమిళ్ తైలవాస్ × పట్నా పైరెట్స్(రాత్రి 8.00గం||లకు)
పుణేరి పల్టన్ × బెంగళూరు బుల్స్(రాత్రి 9.00గం||లకు)