నోయిడా: ప్రొ కబడ్డీ సీజన్-11లో భాగంగా గురువారం జరిగిన పోటీల్లో తెలుగు టైటాన్స్, యుపి యోథా జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో యుపి జట్టు 33-29పాయింట్ల తేడాతో జైపూర్‌ను, తెలుగు టైటాన్స్ జట్టు 41-35 పాయింట్ల తేడాతో యు ముంబాను ఓడించాయి. యుపి జట్టులో భవానీ రాజ్‌పుట్(8), గగన్(6) రైడ్స్‌లో రాణించగా.. సుమిత్(5), హితేశ్(4) ట్యాకిల్స్‌లో మెరిసారు. జైపూర్ జట్టులో అర్జున్(6), నీరజ్(5) మాత్రమే రైడ్స్‌లో రాణించారు. ఇరుజట్లు రెండేసి సార్లు ప్రత్యర్ధి జట్లను ఆలౌట్ చేయగా.. యుపి జట్టు రైడ్‌ల ద్వారా 15, ట్యాకిల్స్ ద్వారా 14పాయింట్లు సాధించింది. ఇక జైపూర్ జట్టు రైడ్‌ల ద్వారా 12, ట్యాకిల్స్ ద్వారా 13పాయింట్లు రాబట్టింది. ఇక తెలుగు టైటాన్స్ జట్టు అర్ధభాగం ముగిసేసరికి 25-12 పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది.