పూణే: ప్రొ కబడ్డీ సీజన్-11లో యుపి యోథాస్ ప్లే-ఆఫ్‌కు చేరువైంది. మంగళవారం జరిగిన గ్రూప్ లీగ్ పోటీలో యుపి యోథాస్ 31-24పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తుచేసింది. యుపి జట్టులో భవానీ రాజ్‌పుట్(11) రైడ్స్‌లో రాణించగా.. భరత్, సుమిత్ ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక హర్యానా జట్టులో వినరు(6), విశాల్(6) మాత్రమే రైడ్స్‌లో రాణించారు. ఇక యుపి జట్టు నాలుగుసార్లు హర్యానా జట్టును ఆలౌట్ చేయడంతోపాటు 9ట్యాకిల్స్ పాయింట్లు కూడా సాధించింది.
ప్రొ కబడ్డీలో నేడు…
గుజరాత్ జెయింట్స్ × యుపి యోథా(రాత్రి 8.00గం||లకు)
యు ముంబ × పట్నా పైరెట్స్(రాత్రి 9.00గం||లకు)