ఎనిమిది జట్లతో పిఎస్‌ఎల్‌ ?

Mar 14,2025 00:17 #Pakistan, #PSL 2025

లాహోర్‌: 2025 పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ను ఎనిమిది జట్ల నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరుజట్ల మధ్య జరిగిన ఈ లీగ్‌ మరింత ప్రజాదరణ పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పిఎస్‌ఎల్‌ సిఇవో సాల్మన్‌ నసీజర్‌ గురువారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2016లో యుఎఇ వేదికగా పిఎస్‌ఎల్‌ తొలి సీజన్‌ ఆరంభమైందని, ఆ తర్వాత పాకిస్తాన్‌ వేదికగా లీగ్‌ జరుగుతున్నట్లు వాణిజ్యం, మీడియా, స్పాన్సర్‌షిప్‌ హక్కులు అమ్మకానికి ఉన్నాయని ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు.

➡️