PBKS vs KKR : చరిత్ర సృష్టించిన పంజాబ్‌

Apr 16,2025 00:39 #pbks, #win
  • 112 పరుగుల ఛేదనలో 95 పరుగులకే ప్రత్యర్ధి జట్టు కట్టడి
  • 16పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలుపు

ఛండీగడ్‌: సీజన్‌-2025 ఐపిఎల్‌లో పంజాబ్‌ కింగ్‌ సంచలనం నమోదు చేసింది. 112పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్ధి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును 95పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఐపిఎల్‌ చరిత్రలో తక్కువ స్కోర్‌ను కాపాడుకుంటూ ప్రత్యర్ధి జట్టుపై గెలుపొందడం ఇదే తొలిసారి. ఇక ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోర్‌ కాగా.. ఛేదనలోనూ ప్రత్యర్ధి జట్టును వంద పరుగుల్లోపు కట్టడి చేయడంతో కూడా ఇదే తొలిసారి. మహారాజా ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు 16పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు 111పరుగులకే కుప్పకూలింది. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ను 95పరుగులకే పరిమితం చేసి సంచలనం నమోదు చేసింది. చాహల్‌(4/28), జాన్సెన్‌(3/17) పంజాబ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్ల విజృంభణతో పంజాబ్‌ కింగ్స్‌ 15.3 ఓవర్లలో 111పరుగులకే ఆలౌటయ్యింది. పేసర్‌ హర్షిత్‌ రానా(3/25) నిప్పులు చెరగగా.. స్పిన్‌ ద్వయం వరుణ్‌ చక్రవర్తి(2/21), సునీల్‌ నరైన్‌(2/14)లు తిప్పేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ చాహల్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు…
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్‌ ఆర్యా (సి)రమన్‌దీప్‌ సింగ్‌ (బి)హర్షీత్‌ రాణా 22, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి)రమణ్‌దీప్‌ సింగ్‌ (బి)హర్షీత్‌ రాణా 30, శ్రేయస్‌ అయ్యర్‌ (సి)రమణ్‌దీప్‌ సింగ్‌ (బి)హర్షీత్‌ రాణా 0, జోస్‌ ఇంగ్లిస్‌ (బి)వరుణ్‌ చక్రవర్తి 2, నేహల్‌ వథేరా (సి)వెంకటేశ్‌ అయ్యర్‌ (బి)నోర్ట్జే 10, మ్యాక్స్‌వెల్‌ (బి)వరుణ్‌ చక్రవర్తి 7, సూర్యాంశ్‌ షిండే (సి)డికాక్‌ (బి)నరైన్‌ 4, శశాంక్‌ సింగ్‌ (ఎల్‌బి)వైభవ్‌ అరోరా 18, జాన్సెన్‌ (బి)నరైన్‌ 1, బార్ట్‌లెట్‌ (రనౌట్‌)వెంకటేశ్‌ అయ్యర్‌/వైభవ్‌ అరోరా 11, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 1, అదనం 5. (15.3ఓవర్లలో ఆలౌట్‌) 111పరుగులు.

వికెట్ల పతనం: 1/39, 2/39, 3/42, 4/54, 5/74, 6/76, 7/80, 8/86, 9/109, 10/111

బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2.3-0-26-1, నోర్ట్జే 3-0-23-1, హర్షీత్‌ రాణా 3-0-25-3, వరుణ్‌ చక్రవర్తి 4-0-21-2, నరైన్‌ 3-0-14-2.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి)సూర్యాంశ్‌ (బి)బార్టెలెట్‌ 2, నరైన్‌ (బి)జాన్సెన్‌ 5, రహానే (ఎల్‌బి)చాహల్‌ 17, రఘువంశీ (సి)బార్ట్‌లెట్‌ (బి)చాహల్‌ 37, వెంకటేశ్‌ అయ్యర్‌ (ఎల్‌బి)మ్యాక్స్‌వెల్‌ 7, రింకు సింగ్‌ (స్టంప్‌)ఇంగ్లిస్‌ 9బి)చాహల్‌ 2, రస్సెల్‌ (బి)జాన్సెన్‌ 17, రమన్‌దీప్‌ సింగ్‌ (సి)శ్రేయస్‌ (బి)చాహల్‌ 0, హర్షీత్‌ రాణా (బి)జాన్సెన్‌ 3, వైభవ్‌ అరోరా (సి)ఇంగ్లిస్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 0, నోర్ట్జే (నాటౌట్‌) 0, అదనం 5. (15.1ఓవర్లలో ఆలౌట్‌) 95పరుగులు.

వికెట్ల పతనం: 1/7, 2/7, 3/62, 4/72, 5/74, 6/76, 7/76, 8/79, 9/95, 10/95

బౌలింగ్‌: జాన్సెన్‌ 3.1-0-17-3, బార్ట్‌లెట్‌ 3-0-30-1, ఆర్ష్‌దీప్‌ 3-1-11-1, చాహల్‌ 4-0-28-4, మ్యాక్స్‌వెల్‌ 2-0-5-1.

➡️