రాణించిన రజత్‌

May 12,2024 22:50 #Sports

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌
బెంగళూర్‌ : రజత్‌ పాటిదార్‌ (52, 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోరు కొనసాగించాడు. ధనాధన్‌ అర్ధ సెంచరీలతో కదం తొక్కుతున్న రజత్‌ పాటిదార్‌ చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై దండయాత్ర చేశాడు. విల్‌ జాక్స్‌ (41, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సైతం రాణించటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (27, 13 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచికొట్టాడు. మూడు సిక్సర్లతో చెలరేగిన కోహ్లి..ఇషాంత్‌ శర్మకు వికెట్‌ కోల్పోయాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (6) నిరాశపరిచాడు. రజత్‌ పాటిదార్‌ (52) మరో అర్థ సెంచరీతో ఫామ్‌ కొనసాగించగా.. విల్‌ జాక్స్‌ వరుస వైఫల్యాలకు చెక్‌ పెట్టాడు. కామెరూన్‌ గ్రీన్‌ (32 నాటౌట్‌, 24 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) డెత్‌ ఓవర్లలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు మంచి స్కోరు అందించాడు. మహిపాల్‌ లామ్రోర్‌ (13), దినేశ్‌ కార్తీక్‌ (0), స్వప్నిల్‌ సింగ్‌ (0), కరణ్‌ శర్మ (6), మహ్మద్‌ సిరాజ్‌ (0) విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ (2/31), రషీక్‌ (2/23) రెండేసి వికెట్లతో రాణించారు.

➡️