Ranji Trophy : ఆంధ్ర ఘన విజయం

Feb 1,2025 22:43 #Cricket, #ranji match, #Sports

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌ నిర్దేశింఇన 153 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 7వికెట్ల నష్టానికి 95పరుగులతో శనివారం రెండో ఇన్నింగ్‌ కొనసాగించిన రాజస్థాన్‌ను ఆంధ్ర బౌలర్లు 114పరుగులకే పరిమితం చేశారు. రాజస్థాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 38పరుగుల ఆధిక్యత లభించగా.. ఆంధ్ర జట్టు 153పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ఛేదనలో ఆంధ్ర ఓపెనర్‌ కృష్ణ(0) నిరాశపరిచినా.. శ్రీకర్‌ భరత్‌(43), రికీ బురు(62), కరణ్‌ షిండే(35) కీలక ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను ముగించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ త్రిపురణ విజరుకు దక్కింది.

హైదరాబాద్‌ లక్ష్యం 220పరుగులు…

విదర్భతో జరుగుతున్న మరో రంజీమ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 220పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. గ్రూప్‌-బిలో హైదరాబాద్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326పరుగులు చేయగా.. విదర్భ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 355పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్‌ ముందు ఆ జట్టు 220పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో భాగంగా మూడోరోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ జట్టు వికెట్‌ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిరథ్‌ రెడ్డి(9), త్యాగరాజన్‌(7) ఉన్నారు.

➡️