- విదర్భ చేతిలో 58పరుగుల తేడాతో ఓటమి
నాగ్‌పూర్: రంజీట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు అనూహ్యంగా విదర్భ చేతిలో ఓటమిపాలైంది. విదర్భ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ 161పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 20 పరుగులతో చివరిరోజు ఆటను కొనసాగించిన హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రాహుల్(48), సిరాజ్(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. విదర్భ బౌలర్లు హర్ష్ దూబే(6/57), పార్థ్ రేఖడే(2/33) బౌలింగ్‌లో మెరిసారు.
విదర్భ : 190, 355
హైదరాబాద్ : 326, 161