- బౌలింగ్‌లో రాణించిన విప్‌రాజ్, కుల్దీప్
- బెంగళూరు ఢిల్లీ గెలుపు
బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబి)పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 164పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 17.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్(93నాటౌట్; 53బంతుల్లో 7ఫోర్లు, 6సిక్సర్లు)కి తోడు స్టబ్స్(38నాటౌట్; 23బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్) మ్యాచ్‌ను ముగించారు. టాపార్డర్ బ్యాటర్లు డుప్లెసిస్(2), ఫ్రేజర్(7), అభిషేక్ పోరెల్(7) నిరాశపరిచినా.. కెఎల్ రాహుల్ క్రీజ్‌లో నిలదొక్కుకొని మ్యాచ్‌ను ముగించడం విశేషం. అంతకుముందు టర్నింగ్ పిచ్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్లు రాణించారు. ఓపెనర్ సాల్ట్‌కు తోడు చివర్లో టిమ్ డేవిడ్ మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 163పరుగులు చేసింది. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(37) టాప్ స్కోరర్. విప్‌రాజ్ నిగమ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడిన రజత్ పటిదార్(25), విరాట్ కోహ్లీ(22)లు విఫలమయ్యారు. అయితే.. టిమ్ డెవిడ్(37 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరును ఒడ్డున పడేశాడు. డెత్ ఓవర్లలో రెచ్చిపోయిన అతడు 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. తొలుత సాల్ట్ తనదైన శైలిలో ధాటిగా ఆడి ఢిల్లీ బౌలర్ల గుండెల్లో గుబులు రేపాడు. మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో రెచ్చిపోయిన అతడు తొలి బంతిని సిక్సర్‌గా మలిచి ఆ తర్వాత 4, 4, 6, 4 బాది 30 పరుగులు రాబట్టాడు. అ తర్వాత అక్షర్ బౌలింగ్‌లో విరాట్ సిక్సర్ బాది స్కోర్ 60 దాటించాడు. అయితే.. ఆ తర్వాత బంతికే సింగిల్ తీసే క్రమంలో సాల్ట్ రనౌటయ్యాడు. అభిషేక్ పొరెల్ విసిరిన బంతి అందుకున్న రాహుల్ వికెట్లను గిరాటేశాడు. దాంతో,61 వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(1) ఔటయ్యాడు. కోహ్లి సైతం విప్‌రాజ్ నిగమ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో జోరు పెంచాడు. కానీ, అదే ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయి మిచెల్ స్టార్క్‌కు దొరికాడు. అంతే.. అక్కడి నుంచి ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గిపోయింది. ఢిల్లీ బౌలర్లలో విప్‌రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌కు రెండేసి, ముఖేశ్ కుమార్, మోహిత్ శర్మకు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (రనౌట్) విప్‌రాజ్ నిగమ్/రాహుల్ 37, కోహ్లి (సి)స్టార్క్ (బి)విప్‌రాజ్ నిగమ్ 22, దేవదత్ పడిక్కల్ (సి)అక్షర్ (బి)ముఖేష్ కుమార్ 1, రజత్ పటీధర్ (సి)రాహుల్ (బి)కుల్దీప్ 25, లివింగ్‌స్టోన్ (సి)అశుతోష్ శర్మ (బి)మోహిత్ శర్మ 4, జితేశ్ శర్మ (సి)రాహుల్ (బి)కుల్దీప్ యాదవ్ 3, కృనాల్ పాండ్యా (సి)అశుతోష్ శర్మ (బి)విప్‌రాజ్ నిగమ్ 18, టిమ్ డేవిడ్ (నాటౌట్) 37, భువనేశ్వర్ కుమార్ (నాటౌట్) 1, అదనం 15. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 153పరుగులు.
వికెట్ల పతనం: 1/61, 2/64, 3/74, 4/91, 5/102, 6/117, 7/125 బౌలింగ్: స్టార్క్ 3-0-35-0, అక్షర్ పటేల్ 4-0-52-0, విప్‌రాజ్ నిగమ్ 4-0-18-2, ముఖేశ్ కుమార్ 3-1-26-1, కుల్దీప్ యాదవ్ 4-0-17-2, మోహిత్ శర్మ 2-0-10-1.
ఢిల్లీ ఇన్నింగ్స్: డుప్లెసిస్ (సి)రజత్ పటీధర్ (బి)యశ్ దయాల్ 2, ఫ్రేజర్ (సి)జితేశ్ శర్మ (బి)భువనేశ్వర్ 7, అభిషేక్ పోరెల్ (సి)జితేశ్ శర్మ (బి)భువనేశ్వర్ 7, కెఎల్ రాహుల్ (నాటౌట్) 93, అక్షర్ పటేల్ (సి)టిమ్ డేవిడ్ (బి)సుయాశ్ శర్మ 15, స్టబ్స్ (నాటౌట్) 38, అదనం 7. (17.5ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 169పరుగులు. వికెట్ల పతనం: 1/9, 2/10, 3/30, 4/58
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-26-2, యశ్ దయాల్ 3.5-0-45-1, హస్త్రజిల్‌వుడ్ 3-0-40-0, సుయాశ్ శర్మ 4-0-25-1, కృనాల్ పాండ్యా 2-0-19-0, లివింగ్‌స్టోన్ 1-0-14-0