- ఆసీస్ పర్యటనకు జట్టును ప్రకటించిన హెచ్‌ఐ
భువనేశ్వర్: ఆస్ట్రేలియా పర్యటించిన మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) సోమవారం ప్రకటించింది. కెప్టెన్‌గా మిడ్‌ఫీల్డర్ సలీమా తేటె, వైస్ కెప్టెన్‌గా నవ్‌నీత్ కౌర్(ఫార్వర్డ్) ఎంపికవ్వగా.. ఐదుగురు క్రీడాకారిణులు సీనియర్ జట్టులో అరంగేట్రం చేయనున్నారు. జ్యోతి సింగ్, సుజాత కజూర్, అజ్మినా కుజుర్, పూజ యాదవ్, మహిమా తేతే అంతర్జాతీయ హాకీ మ్యాచుల్లో అరంగేట్రం చేయనున్నారు. గోల్‌కీపర్‌గా సవిత, బిచ్ఛుదేవి ఎంపికయ్యారు. ఈనెల 26నుంచి మే 4వరకు పెర్త్ హాకీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎతో 2మ్యాచ్‌ల సిరీస్‌లో భారత మహిళల హాకీ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
జట్టు: డిఫెండర్లు: జ్యోతి సింగ్, ఇషికా చౌదరి, సుశీలా ఛాను, సుజాత కుజుర్, సుమన్ దేవి, జ్యోతి, అజ్మినా కుజుర్, సాక్షి రాణా. మిడ్‌ఫీల్డర్లు: సలీమా టేతె, వైష్ణవి, నేహా, షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునీతా టోపో, మహిమా టేతె, పూజ యాదవ్, లాల్‌రిమిసిమి, ఫార్వర్డ్స్: నవ్‌నీత్ కౌర్, దీపిక, రుతుజ, ముంతాజ్ ఖాన్, బల్జీత్ కౌర్, దీపిక షొరెన్, బ్యూటీ డంగ్‌డున్. స్టాండ్‌బై: బన్సారి సోలంకి(గోల్‌కీపర్), అంజన, లాల్‌తుంగి(డిఫెండర్లు), సాక్షి శుక్లా, ఖైడమ్ షిలేమా(మిడ్‌ఫీల్డర్లు), డిపి మోనిక, సోనమ్(ఫార్వర్డ్)