ఐపిఎల్-20225 సీజన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన చేసింది. ఐపిఎల్ వేలంలో అత్యధిక ధరకు కొనుగోలు చేసిన రిషభ్ పంత్‌ను కెప్టెన్ నియమిస్తున్నట్లు ఫ్రాంఛైజీ తెలిపింది. పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంత్ కూడా గొయెంకాతో కలిసి పాల్గొన్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో పంత్‌ను లక్నో ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. లక్నో కెప్టెన్ రేసులో నికోలస్ పూరన్ నిలిచినా.. పంత్ వైపే యజమాన్యం మొగ్గుచూపింది. ‘రిషభ్ పంత్ ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడు మాత్రమే కాదు అత్యుత్తమ ఆటగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మను విజయవంతమైన కెప్టెన్లు అని చెబుతారు. నా మాటలు గుర్తుంచుకోండి. 10-12 ఏళ్ల తర్వాత పంత్ కూడా వారి సరసన చేరుతాడు’ అని సంజీవ్ గొయెంకా పేర్కొన్నారు.
