సచిన్‌కు సికె నాయుడు లైఫ్‌టైమ్‌ అవార్డు ప్రదానం

  • అట్టహాసంగా బిసిసిఐ అవార్డుల వేడుక

ముంబయి: క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అందజేసే సికె నాయుడు లైఫ్‌టైమ్‌ అవార్డును దిగ్గజ క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ అందుకున్నాడు. ముంబయిలో శనివారం జరిగిన బిసిసిఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమ క్రికెటర్లకు పురస్కారాలు అందజేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో బిసిసిఐ గౌరవించింది. ఈ అవార్డును ఐసిసి అధ్యక్షులు జై షా చేతుల మీదుగా సచిన్‌ అందుకున్నాడు. సికె నాయుడు పేరుతో ఇస్తున్న ఈ పురస్కారానికి ఈసారి సచిన్‌ ఎంపికైన విషయం తెలిసిందే. 2023-24 సీజన్‌కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను బిసిసిఐ ఎంపిక చేసింది.

బిసిసిఐ అవార్డులు అందుకున్న కొందరు..
సికె నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు : సచిన్‌ టెండూల్కర్‌
పాలి ఉమ్రిగర్‌ అవార్డు (ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌) : బుమ్రా
ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌: స్మతి మంధాన
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు) : సర్ఫరాజ్‌ ఖాన్‌
ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు) : ఆశా శోభనా
బిసిసిఐ స్పెషల్‌ అవార్డు : రవిచంద్రన్‌ అశ్విన్‌
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌ : స్మతి మంధాన
వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌ : దీప్తి శర్మ
మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు : రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌: ఆర్‌. సాయి కిశోర్‌
మాధవ్‌రావ్‌ సింధియా అవార్డు : రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌): అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌ : రికీ భూరు
లాలా అమర్‌నాథ్‌ అవార్డు : బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (డొమెస్టిక్‌ లిమిటెడ్‌ ఓవర్స్‌ కాంపిటీషన్‌)-శశాంక్‌సింగ్‌
లాలా అమర్‌నాథ్‌ అవార్డు : బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ (రంజీ ట్రోఫీ):తనుశ్‌ కోటియన్‌
బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇన్‌ బిసిసిఐ డొమెస్టిక్‌ టోర్నమెంట్స్‌: ముంబయి

➡️