సర్వీస్‌ గన్‌తో కాల్చుకున్న సచిన్‌ సెక్యూరిటీ గార్డు

May 15,2024 16:36 #Sports

జల్గావ్‌: సచిన్‌ టెండూల్కర్‌కు భద్రతా సిబ్బందిలోని స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ జవాన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జామ్నేర్‌ పట్టణంలోని తన స్వంత ఇంట్లో అతను కాల్చుకున్నట్లు తెలుస్తోంది. బలవన్మరణానికి పాల్పడిన ఆ పోలీసును ప్రకాశ్‌ కాప్డేగా గుర్తించారు. కొన్ని రోజుల నుంచి లీవ్‌లో ఉన్న ఈ జవాన్‌ సర్వీస్‌ గన్‌తో మెడలో కాల్చుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం తెల్లవారుఝామున 1.30గం||లకు అతను ఆత్మహత్య చేసుకున్నట్లు జామ్నేర్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ షిండే తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆ జవాన్‌ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఈ కేసును ఎస్‌ఆర్పీఎఫ్‌ దర్యాప్తు చేస్తుందని షిండే తెలిపారు.

➡️