విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టర్లు నదియ అల్మాస్, నదమ్ జ్ఞానదివ్య, సయ్యద్ ఖాజావలి భారతజట్టులో చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్‌లిఫ్టింగ్ అసోసియేన్ బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈనెల 4నుంచి దక్షిణాఫ్రికా వేదికగా సన్‌సిటీలో జరిగే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో వీరు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. నదియా అల్మాస్(57కిలోలు), నగమ్ జ్ఞానదివ్య(84కిలోలు), సయ్యద్ ఖాజావలి(93కిలోలు) విభాగాల్లో పోటీ పడనున్నారు.
అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఆంధ్ర క్రీడాకారులకు జనరల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ సిహెచ్ శేషుబాబు, సౌత్‌జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. కోటేశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.