ముంబయి: ఇరానీ కప్‌లో ఆడేందుకు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, యశ్ దయాల్‌కు అనుమతి లభించింది. టీమిండియాకు ఎంపికైన వీరు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇరానీ కప్‌లో ఆడనున్నారు. ఈ ముగ్గురు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికవ్వగా.. తాజాగా ఇరానీ ట్రోఫీలో ఆడేందుకు బిసిసిఐ అనుమతి లభించడంతో రిలీజ్ అయ్యారు. ఆయా జట్ల తరఫున తుది 11మంది ఆటగాళ్ల జాబితాలో వీరికి చోటు దక్కితే ఇరానీ కప్‌లో ఆడనున్నారు. ఇక అజింక్యా రహానే నేతృత్వంలోని ముంబయి తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఆడనుండగా.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని రెస్టాఫ్ ఇండియా జట్టుకు జురెల్, దయాల్ ఆడనున్నారు.