సుదీర్మన్‌ కప్‌ బరిలో సాత్విక్‌-చిరాగ్‌

న్యూఢిల్లీ: ఈనెల 27నుంచి చైనా వేదికగా జరిగే సుదీర్మన్‌ కప్‌ బరిలో భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి బరిలో దిగనున్నారు. మొత్తం 16జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్‌కు 14మంది షట్లర్లతో కూడిన భారత జట్టు బరిలోకి దిగుతోంది. భారత పురుషుల డబుల్స్‌ జోడీకి 11వ సీడ్‌ దక్కింది. గత వారం జరిగిన బ్యాడ్మింటన్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌ కాంటినెంటల్‌ ఛాంపియన్‌షిప్‌ బరిలో దిగుతున్న నేపథ్యంలో ఈ టోర్నీలో ఈ జోడీ బరిలోకి దిగడం లేదు. ఏప్రిల్‌ 27నుంచి మే 4వరకు చైనాలోని షియామెన్‌ వేదికగా సుదీర్మన్‌ కప్‌ టోర్నమెంట్‌ జరగనుంది. లక్ష్యసేన్‌, హెచ్‌ఎస్‌ ప్రణరు, పివి సింధు, అనుపమ ఉపాధ్యాయ, హరిహరన్‌-రూబన్‌ కుమార్‌, సృతి మిశ్రా-ప్రియా, తానీసా క్రాస్టో-ధృవ్‌ కపిల, ఆధ్యావరియత్‌-సతీశ్‌ కుమార్‌

➡️