- మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
కౌలాలంపూర్: మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి చిరాగ్‌శెట్టి-సాత్విక్ సాయిరాజ్ దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో చిరాగ్-సాత్విక్ 21-15, 21-15తో మలేషియాకు చెందిన టాన్-ఆయుబ్‌లను చిత్తుచేశారు. క్వార్టర్స్‌లో వీరు మలేషియాకే చెందిన ఇ.వై.టెన్-వై.ఎస్ ఆన్‌లతో తలపడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణరుకు ప్రి క్వార్టర్స్‌లో నిరాశ తప్పలేదు. మూడుసెట్ల హోరాహోరీ పోరులో ప్రణరు లీ(చైనా) చేతిలో ఓటమిపాలయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో ప్రణరు 8-21, 21-15, 21-23తో పరాజయాన్ని చవిచూశాడు. ఇక మహిళల సింగిల్స్ లో మాల్విక పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో మాల్విక 18-21, 11-21తో వై.యన్(చైనా) చేతిలో ఓటమిపాలైంది. ఇక మహిళల డబుల్స్‌లోనూ త్రీసా జోలీ-గాయత్రి జంటకు నిరాశ తప్పలేదు. వీరు 21-15, 18-21, 19-21తో చైనా షట్లర్ల చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో కరుణాకరన్-ఆథ్యా, ధృవ్ కపిల-తానీసా కాస్ట్రో జంటలు ఓటమిపాలయ్యాయి. ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరిన ఏకైక జంట సాత్విక్-చిరాగ్ మాత్రమే.