- మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
కౌలాలంపూర్: మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లోకి భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జంట దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట 26-24, 21-15తో మలేషియాకు చెందిన టియో-ఓంగ్‌లను చిత్తుచేశారు. తొలి గేమ్‌ను చేజిక్కించుకునేందుకు భారత జంట చెమటోడ్చాల్సి వచ్చింది. సెమీస్‌లో వీరు కొరియాకు చెందిన కిమ్-సియోతో తలపడనున్నారు.