కౌలాలంపూర్: మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో సెమీస్‌కు చేరిన సాత్విక్-చిరాగ్ జంట వరుససెట్లలో కొరియా షట్లర్ల చేతిలో ఓటమిపాలయ్యారు. ఏకపక్షంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ 10-21, 15-21తో పరాజయాన్ని చవిచూశారు. ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి చైనా షట్లర్లు షీ-యు-క్యూ, ఎస్.ఎఫ్. లీతోపాటు నర్రోకా(జపాన్), ఆంటోన్సెన్(డెన్మార్క్) ప్రవేశించారు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ఎస్.ఎఫ్ అన్(కొరియా), జంగ్(చైనా) ప్రవేశించారు. సెమీస్‌లో జంగ్ 10-21, 12-21తో ఛో-కీవాంగ్(థారులాండ్), రెండో సెమీస్‌లో సన్-అన్ 21-14, 21-18తో ఇంటనాన్ (థారులాండ్)ను ఓడించారు.
