3వేల స్టీపుల్‌ఛేజ్‌లో షారుక్‌ జాతీయ రికార్డు

  • అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 3వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో షారుక్‌ ఖాన్‌ జాతీయ రికార్డును బ్రేక్‌ చేశాడు. బుధవారం రాత్రి జరిగిన స్టీపుల్‌ఛేజ్‌లో భారత్‌కు చెందిన 18ఏళ్ల షారుక్‌ 8నిమిషాల 45:12సెకన్లలో గమ్యానికి చేరి 6వ స్థానంలో నిలిచాడు. దీంతో 31న జరిగే ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ హీట్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌కు చేరతారు. అంతకుముందు ఈ రికార్డు 19ఏళ్ల రాజస్తాన్‌కు చెందిన రాజేశ్‌ పేర ఉండేది. అతడు భువనేశ్వర్‌ వేదికగా మేలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో 8నిమిషాల 50:12సెకన్లలో గమ్యానికి చేరి జాతీయ రికార్డును నెలకొల్పాడు. షారుక్‌ ఖాన్‌ పర్సనల్‌ బెస్ట్‌ 8నిమిషాల 51:75 సెకన్ల రికార్డును తాజాగా సవరించుకొన్నాడు. ఇక పురుషుల 400మీ. పరుగులో జయకుమార్‌ మూడోస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరాడు. అతడు హీట్‌లో 400మీ. పరుగును 46.96సెకన్లలో గమ్యానికి చేరాడు.

➡️