శీతల్‌కు రజతం

Apr 17,2024 20:35 #Archery Competitions, #Sports
  • జాతీయ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: జాతీయ పారా ఆర్చరీ మీట్‌లో శీతల్‌ దేవి రజత పతకంతో మెరిసింది. ఆసియా పారా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన శీతల్‌ దేవి ఖేలో ఇండియా ఎన్‌టిపిసి ర్యాంకింగ్స్‌లో పతకంతో మెరిసింది. డిడిఎ యమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్లో 17ఏళ్ల శీతల్‌ కాంపౌండ్‌ విభాగంలో 138-140తో ఏక్తా చేతిలో ఓటమిపాలైంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ, రజత పతకాన్ని సాధించిన శీతల్‌కు ఇటీవల భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. రెండు చేతులు లేకున్నా ఆర్చరీలో పతకాలు కొల్లగొడుతున్న శీతల్‌ ఆర్చర్లందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

➡️