- ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
లండన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో పివి సింధు తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం చైసీస్ తైపీకి చెందిన జి.ఇ. కిమ్‌తో తలపడిన సింధు.. తొలి గేమ్‌ను 21-19తో నెగ్గినా.. ఆ తర్వాత 13-21, 13-21తో మిగిలిన రెండు సెట్లను చేజార్చుకుంది. ఇక మహిళల సింగిల్స్‌లో మరో షట్లర్ మాల్విక బన్సోద్ గురువారం జరిగే తొలిరౌండ్ పోటీలో టాప్‌సీడ్, జపాన్‌కు చెందిన యమగుచితో తలపడనుంది. ఇక పురుషుల డబుల్స్‌లో మిశ్రా-కుంజేగమ్ జంట 9-21, 4-21తో కొరియా జంట చేతిలో ఓటమిపాలవ్వగా.. మహిళల డబుల్స్‌లో తానీసా కాస్ట్రో-అశ్విని పొన్నప్ప 20-22, 18-21తో చైనీస్ తైపీ జంట చేతిలో పోరాడి ఓటమిపాలయ్యారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆర్.కపూర్-గద్దే జంట 21-10, 17-21, 24-22తో చైనీస్ తైపీ జంటను ఓడించారు.