న్యూయార్క్: యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్, ఇటలీకి చెందిన జెన్నిక్ సిన్నర్ ప్రవేశించాడు. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో సిన్నర్ 7-6(7-3), 7-6(7-5), 6-1తో 14వ సీడ్, అమెరికాకు చెందిన టామీ పాల్‌ను చిత్తుచేశాడు. తొలి రెండు సెట్‌లను టై బ్రేక్‌లో చేజిక్కించుకున్న సిన్నర్.. మూడో సెట్‌లో ప్రత్యర్ధిపై సునాయాసంగా గెలుపొందాడు. మరో ప్రి క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 10వ సీడ్ డి-మినర్ 6-0, 3-6, 6-3, 7-5తో తన దేశానికే చెందిన థాంప్సన్‌ను ఓడించాడు.
స్వియాటెక్, హడ్డాడ్ కూడా..
ఇక మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్, పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్, 22వ సీడ్, బ్రెజిల్‌కు చెందిన హడ్డాడ్ మలా కూడా ప్రవేశించారు. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో స్వైటెక్ 6-4, 6-1తో 16వ సీడ్, రష్యాకు చెందిన సంసునోవాను చిత్తుచేయగా.. హడ్డాడ్ 6-3, 3-6, 6-3తో అన్‌సీడెడ్, మాజీ ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, డెన్మార్క్‌కు చెందిన వాజ్నింయాకీను ఓడించింది.
క్వార్టర్‌ఫైనల్స్(సింగిల్స్)…
పురుషులు మహిళలు
ఫ్రిట్జ్(12) × జ్వెరేవ్(4) బడోసా(26) × నవార్రో(13)
డిమిట్రోవ్(9) × టఫీ(20) జెంగ్(7) × సబలెంకా(2)
డ్రాపర్(25) × డి-మినర్(10) హడ్డాడ్ మల(22) × ముఛోవా
సిన్నర్ × మెద్వదెవ్(5) స్వియాటెక్(1) × పెగూలా(6)