Australian Open : సెమీస్‌కు సిన్నర్‌, షెల్టన్‌

  • మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌, కీస్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి టాప్‌సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌, అమెరికాకు చెందిన 21వ సీడ్‌ షెల్టన్‌ సెమీస్‌కు చేరారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సిన్నర్‌ 6-3, 6-2, 6-1తో 8వ సీడ్‌, ఆస్ట్రేలియాకు చెందిన డి-మినర్‌ను వరుససెట్లలో చిత్తుచేశారు. సంచలన విజయాలతో క్వార్టర్స్‌కు చేరిన స్థానిక ఆటగాడు టాప్‌సీడ్‌ ప్లేయర్‌కు అడ్డుకట్ట వేయలేకపోయాడు. ఇక షెల్టన్‌ 6-4, 7-5, 4-6, 7-5(7-4)తో ఇటలీకే చెందిన అన్‌సీడెడ్‌ ఆటగాడు సొనేగోను ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి 2వ సీడ్‌, పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్‌, 19వ సీడ్‌, అమెరికాకు చెందిన మడిసన్‌ కీస్‌ ప్రవేశించారు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో స్వియాటెక్‌ 6-1, 6-2తో అమెరికాకు చెందిన 8వ సీడ్‌ నవ్వారోను చిత్తుచేయగా.. కీస్‌ 3-6తో తొలిసెట్‌ను కోల్పోయినా… ఆ తర్వాత రెండుసెట్లను 6-3, 6-4తో ముగించి సెమీస్‌కు చేరింది.

సింగిల్స్‌ సెమీఫైనల్స్‌…
23(గురు) : సబలెంక(1) × బడోసా(11)
కీస్‌(19) × ఇగా స్వియాటెక్‌(2)
24(శుక్ర) : సిన్నర్‌(1) × షెల్టన్‌(21)
జకోవిచ్‌(7) × జ్వెరేవ్‌(2)

➡️