SL-NZ: మూడో వన్డేలో లంక గెలుపు

  • సిరీస్‌ 2-1తో న్యూజిలాండ్‌ కైవసం

ఆక్లాండ్‌: మూడో వన్డేలో శ్రీలంకకు ఊరట లభించింది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన లంక జట్టు.. మూడో వన్డేలో ఆతిథ్య జట్టుపై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 290పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్‌ జట్టు 29.4ఓవర్లలో 150పరుగులకే కుప్పకూలింది. లంక జట్టులో నిస్సంక(66), కుశాల్‌ మెండీస్‌(54), లియనాగే(53) అర్ధసెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లు హెన్రీకి నాలుగు, సాంట్నర్‌కు రెండు, బ్రాస్‌వెల్‌కు ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం లంక బౌలర్లు ఫెర్నాండో(3/26), ఈషన్‌ మలింగ(3/25), తీక్షణ(3/35) దెబ్బకు కివీస్‌ జట్టు 150పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ జట్టులో చాప్మన్‌(81)టాప్‌ స్కోరర్‌. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫెర్నాండోకు, సిరీస్‌ హెన్రీకి దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు 2-1తో చేజిక్కించుకొని ట్రోఫీని కైవసం చేసుకుంది.

➡️