డబ్ల్యూటీసీ టాప్‌ ప్లేస్‌లో సౌతాఫ్రికా

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా టాప్‌ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఐదోరోజు 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 238 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో సౌతాఫ్రికా 109 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. తాజా విజయంతో 63.33 పాయింట్లతో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ టేబుల్‌లో మొదటి స్థానానికి చేరుకోగా 60.71 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. అడిలైడ్‌ టెస్ట్‌లో ఓటమితో భారత్‌ 57.29 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. వరుస ఓటములతో శ్రీలంక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 45.45 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

➡️