ICC Women’s Under-19 T20 World Cup Final – టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు సౌతాఫ్రికా

కౌలాలంపూర్‌ : ఐసిసి మహిళల అండర్‌-19 టి 20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టోర్నీ ప్రారంభం నుండి సంచలన విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన టీమిండియా.. అదే జోరును ఫైనల్లోనూ చూపితే వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను చేజిక్కించుకోనుంది. దక్షిణాఫ్రికా, భారత్‌ జట్ల తుదిపోరులో … టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌ ను ఎంచుకుంది. అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు, ఓటమి లేకుండా ఫైనల్‌ కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడాలని ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు అమ్మాయి గొంగడి త్రిషపై భారత్‌ మరోసారి చూస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగుల బ్యాటర్‌గా త్రిష (265 పరుగులు)నే కొనసాగుతోంది.

భారత మహిళల యు 19 జట్టు : కమలిని(వికెట్‌ కీపర్‌), గొంగడి త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్‌(కెప్టెన్‌), ఈశ్వరి అవ్సరే, మిథిలా వినోద్‌, ఆయుషి శుక్లా, జోషిత షబ్నం షకీల్‌, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ

దక్షిణాఫ్రికా మహిళల యు 19 జట్టు : జెమ్మా బోథా, సిమోన్‌ లౌరెన్స్‌, డయారా రామ్లాకన్‌, ఫే కౌలింగ్‌, కైలా రేనెకే(కెప్టెన్‌), కరాబో మెసో(వికెట్‌ కీపర్‌), మైకే వాన్‌ వూర్స్ట్‌, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్‌ వైక్‌, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్‌ నిని

Women’s Under-19: ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాలి

➡️