మకావ్(చైనా): అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటిటిఎఫ్) ప్రపంచకప్‌లో భారత టిటి క్రీడాకారిణిలు శ్రీజ ఆకుల, మనిక భత్రా గ్రూప్‌స్టేజ్‌లోనే ఓటమిపాలయ్యారు. 16జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో భారత్ తరఫున పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగాయి. బుధవారం జరిగిన గ్రూప్ పోటీలో 1-3తేడాతో చైనా చేతిలో ఓటమిపాలైంది. 39వ ర్యాంకర్ శ్రీజ 4-11,, 4-11, 15-13, 2-11తో ఒలింపిక్ ఛాంపియన్, 4వ ర్యాంకర్ చెన్ మెంగ్ చేతిలో ఓటమిపాలైంది. ఇక 37వ ర్యాంకర్ మనిక 6-11, 4-11, 9-11, 4-11తో 2వ ర్యాంకర్ మన్యు చేతిలో వరుససెట్లలో ఓడింది. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాకౌట్‌కు చేరతాయి.
