శ్రీలంక క్లీన్‌స్వీప్‌

Feb 14,2025 22:45 #Australia, #Sri Lanka

రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఘన విజయం
కొలంబో: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక జట్టు 175పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 50ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 281పరుగులు చేయగా.. ఛేదనలో ఆస్ట్రేలియాను కేవలం 107పరుగులకే ఆలౌట్‌ చేసింది. శ్రీలంక జట్టులో కుశాల్‌ మెండీస్‌(101) సెంచరీకి తోడు, మధుష్క(51), కెప్టెన్‌ అసలంక(78నాటౌట్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్‌ స్మిత్‌(29), ఇంగ్లిస్‌(22) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. దీంతో ఆసీస్‌ జట్టు 24.2ఓవర్లలో 107పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో వెల్లెలగేకు నాలుగు, హసరంగ, ఫెర్నాండోకు మూడేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కుశాల్‌ మెండీస్‌కు, సిరీస్‌ అసలంకకు దక్కాయి.

➡️