గెలుపు ముంగిట శ్రీలంక

  • న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 88/10
  • ఫాలోఆన్‌లో కివీస్‌జట్టు

గాలే: గాలే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్ట్‌లో శ్రీలంక జట్టు గెలుపుకు చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 88పరుగులకే కట్టడి చేయడంతోపాటు ఫాలో ఆన్‌లో పర్యాటక జట్టును 5వికెట్ల నష్టానికి 199పరుగులతో కష్టాల్లో పడేంసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్ల వైఫల్యంతో 88 పరుగులకే న్యూజిలాండ్‌ ఆలౌటైంది. దీంతో 1992 తర్వాత శ్రీలంకపై ఇంత తక్కువ పరుగులకు న్యూజిలాండ్‌ ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు లంకపై 102కు కివీస్‌ పది వికెట్లు కోల్పోయింది. మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే ప్రభాత్‌ జయసూర్య(6/42), అరంగేట్ర స్పిన్నర్‌ నిషాన్‌ పీరిస్‌(3/33)ల విజృంభించారు. ఆల్‌రౌండర్‌ మిచెల్‌ శాంటన్నర్‌ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం న్యూజిలాండ్‌ ఫాలో ఆన్‌లో ఆడుతూ మూడోరోజు ఆట ముగిసే సమయానికి 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(61) అర్ధ సెంచరీతో రాణించగా.. కేన్‌ విలియమ్సన్‌(46) ఫర్వాలేదనిపించాడు. 121 పరుగులకే టాప్‌ ఆటగాళ్లంతా డగౌట్‌కు చేరిన వేళ టామ్‌ బ్లండెల్‌(26 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిఫ్స్‌(10) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్‌ ఇంకా 357 పరుగులు వెనకబడి ఉంది.

➡️