POST – తండ్రయిన స్టార్‌ క్రికెటర్‌ – ముద్దులబాబుతో జంట ఫోటోలు..!

క్రీడలు : స్టార్‌ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌, సినీనటి సాగరిక ఘట్గే లకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆ జంట ప్రకటించారు. వారు తమ బిడ్డకు ఫతేసిన్హ్‌ ఖాన్‌ అని పేరు పెట్టారు. ఈ ప్రకటనతో పాటు, వారు తమ ముద్దుల బాబుతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పలు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న సాగరిక ” ప్రేమ, కృతజ్ఞత, దైవిక ఆశీర్వాదాలతో మేము మా విలువైన చిన్న బాబు ఫతేసిన్హ్‌ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము ” అని పేర్కొన్నారు. ఈ జంటకు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

➡️