మెల్‌బోర్న్: భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాడు. 2025 ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ కట్ ఆఫ్ శుక్రవారం కాగా… సుమిత్ ఎటిపి ర్యాంకింగ్స్‌లో 98వ ర్యాంక్‌లో నిలిచాడు. టాప్-98 ర్యాంక్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు నేరుగా అర్హత దక్కనుంది. 2024లోనూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నేరుగా చోటు దక్కించుకున్న సుమిత్.. తొలిరౌండ్‌లో 31వ ర్యాంకర్ బబ్లిక్(కజకిస్తాన్)ను ఓడించి రెండోరౌండ్‌కు చేరాడు. తాజా ఎటిపి ర్యాంకింగ్స్‌లో జెన్నిక్ సిన్నర్(ఇటలీ), మహిళల సింగిల్స్‌లో అర్యానా సబలెంక(బెలారస్) టాప్‌లో నిలిచారు.