- పటిష్ట బ్యాటింగ్‌తోనే టెస్ట్ సిరీస్ సాధ్యం: ఛటేశ్వర పుజారా సూచన
అడిలైడ్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సిరీస్ కొట్టాలంటే బ్యాటర్లు రాణించాల్సిందేనని టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛటేశ్వర పుజారా తెలిపాడు. తొలి టెస్ట్, రెండోటెస్ట్‌లోనూ బౌలర్ల ఆధిపత్యం కొనసాగించిందని, ముఖ్యంగా రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 300కు పైగా పరుగులు చేయడం టీమిండియా ఓటమికి కారణాలని పేర్కొన్నాడు. తొలి రెండు టెస్టుల్లో ఫలితం తేలడంతో రాబోయే మూడు టెస్టులు ఫలితం రావడం ఖాయమన్నాడు. పెర్త్ టెస్ట్‌లో టీమిండియా 325పరుగుల తేడాతో గెలిస్తే.. అడిలైడ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసిందని, ఈ క్రమంలో మూడో టెస్ట్ జరిగే బ్రిస్బేన్‌లో టీమిండియా పుంజుకోవాలని అన్నాడు. సిరీస్ 1-1తో సమంగా ఉన్న ఈ దశలో బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ప్లేయింగ్ ఎలెవెన్‌కుకీలక మార్పును సూచించాడు. భారత్ బ్యాటింగ్ ఆర్డను పటిష్టం చేసుకోవాల్సి ఉందని, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను చేర్చాలని పుజరా సూచించాడు. స్పిన్నర్లకు అనుకూలించని పిచ్‌లపై అశ్విన్ 18 ఓవర్లలో 1/53 మాత్రమే రాణించాడని, అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్లలో అశ్విన్ అయినా.. బ్యాటింగ్‌లో వైఫల్యం ఫలితంపై ప్రభావం చూపుతోందన్నాడు. ఆల్‌రౌండర్ల సామర్థ్యాన్ని ఇలాంటప్పుడే మేనేజ్‌మెంట్, కెప్టెన్ సరైన క్రమంలో వినియోగించుకోవాల్సి ఉందన్నాడు.