దక్షిణాఫ్రికా టి20లీగ్‌ విజేత సన్‌రైజర్స్‌

Feb 13,2024 07:54 #Cricket, #Sports

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా టి20 లీగ్‌ విజేతగా సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ జట్టు నిలిచింది. న్యూల్యాండ్స్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌ జట్టు 89పరుగుల తేడాతో డర్బన్‌ సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 204పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. అబెల్‌(55), కెప్టెన్‌ మార్‌క్రమ్‌(42), స్టబ్స్‌(56) బ్యాటింగ్‌లో రాణించారు. ఓపెనర్‌ జోర్డాన్‌(42) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. డర్బన్‌ బౌలర్లు మహరాజ్‌కు రెండు, టోప్లేకు ఒక వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన డర్బన్‌ జట్టును జాన్సన్‌(5/30), బార్ట్‌మన్‌(2/17), డానియల్‌(2/15) కట్టడి చేశారు. దీంతో డర్బన్‌ జట్టు 17ఓవర్లలో కేవలం 115పరుగులకే ఆలౌటైంది.

2024 సీజన్‌ అవార్డు విజేతలు…

విజేత : సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌

రన్నరప్‌ : డర్బన్‌ సూపర్‌జెయింట్స్‌

స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌: సన్‌రైజర్స్‌)

రైజింగ్‌ స్టార్‌ : మార్కో జాన్‌సెన్‌(సన్‌రైజర్స్‌)

అత్యుత్తమ బ్యాటర్‌ : హెన్రిక్‌ క్లాసెన్‌(డర్బన్‌)

అత్యుత్తమ బౌలర్‌ : ఓట్నిల్‌ బార్ట్‌మన్‌(సన్‌రైజర్స్‌)

ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ : హెన్రిక్‌ క్లాసెన్‌(డర్బన్‌)

➡️