SRH vs MI: దూసుకొస్తున్న ముంబయి

Apr 23,2025 23:11 #2025, #IPL, #Sports, #SRH vs MI

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్ల ఆటతీరు మారలేదు. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించ లేకపోతున్న హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఉప్పల్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగి న లీగ్‌ మ్యాచ్‌లోనూ నిరాశపరి చారు. దీంతో ముంబయి చేతిలో ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడారు. తొలుత ముంబయి బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 143పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్‌ జట్టు.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేక 15.4ఓవర్లలోనే ముంబయి చేతిలో చిత్తుగా ఓడింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(70), సూర్యకుమార్‌ యాదవ్‌(40నాటౌట్‌) ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషిం చారు. ఈ గెలుపుతో ముంబయి జట్టు వరుసగా నాల్గో విజయాన్ని సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది. తొలుత హైదరాబాద్‌ జట్టు 13పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విధ్వంసక ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(0)ను బౌల్ట్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్‌ కిషన్‌(1) సైతం దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్టన్‌ చేతికి చిక్కాడు. ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపే.. అభిషేక్‌ శర్మ(8), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(2)లు పేలవ షాట్లతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, 14 పరుగులకే కమిన్స్‌ సేన నలుగురు ప్రధాన ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్లాసెన్‌(71) అర్ధసెంచరీకి తోడు.. అభినవ్‌ మనోహర్‌(43) ఆచి తూచి ఆడారు. దీంతో సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 143పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బౌల్ట్‌కు లభించింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే-ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా మారాయి.

స్కోర్‌బోర్డు…
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి)నమన్‌ ధీర్‌ (బి)బౌల్ట్‌ 0, అభిషేక్‌ శర్మ (సి)విగేష్‌ (బి)బౌల్ట్‌ 8, ఇషాన్‌ కిషన్‌ (సి)రికెల్టన్‌ (బి)చాహల్‌ 1, నితీశ్‌ కమార్‌ రెడ్డి (సి)సాంట్నర్‌ (బి)చాహల్‌ 2, క్లాసెన్‌ (సి)తిలక్‌ వర్మ (బి)బుమ్రా 71, అంకిత్‌ వర్మ (సి)రికెల్టన్‌ (బి)హార్దిక్‌ 12, అభినవ్‌ మనోహర్‌ (హిట్‌వికెట్‌) బి)బౌల్డ్‌ 43, కమిన్స్‌ (బి)బౌల్డ్‌ 1, హర్షల్‌ పటేల్‌ (నాటౌట్‌) 1, అదనం 4. (20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 143పరుగులు.

వికెట్ల పతనం: 1/2, 2/9, 3/13, 4/13, 5/35, 6/134, 7/142, 8/143

బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-12-2, బౌల్ట్‌ 4-0-26-4, బుమ్రా 4-0-39-1, సాంట్నర్‌ 4-0-19-0, హార్దిక్‌ పాండ్యా 3-0-31-1, విగేశ్‌ 1-0-15-0.

ముంబయి ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి అండ్‌ బి)ఉనాద్కట్‌ 11, రోహిత్‌ శర్మ (సి)అభిషేక్‌ శర్మ (బి)ఈషన్‌ మలింగ 70, విల్‌ జాక్స్‌ (సి)మనోహర్‌ (బి)జీషన్‌ 22, సూర్యకుమార్‌ యాదవ్‌ (నాటౌట్‌) 40, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 2, అదనం 1. (15.4ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 146పరుగులు.

వికెట్ల పతనం: 1/13, 2/77, 3/130

బౌలింగ్‌: కమిన్స్‌3-0-31-0, ఉనాద్కట్‌ 3-0-25-1, హర్షల్‌ పటేల్‌ 3-0-21-0, ఈషన్‌ మలింగ 3-0-33-1, జీషన్‌ అన్సన్‌ 3.4-0-36-1.

➡️