సురేఖ జోడీకి పసిడి

న్యూఢిల్లీ: తెలుగు ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌ స్టేజ్‌ 1 పోటీల్లో రిషభ్‌ యాదవ్‌తో కలిసి కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఫైనల్లో సురేఖ-రిషభ్‌ జోడీ 153-151తో చైనీస్‌ తైపీ ద్వయం హువాంగ్‌ జో – చెన్‌ చి లున్‌పై విజయం సాధించింది. ఇప్పుడు సురేఖ గెలిచిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌నే 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో ప్రవేశపెడుతున్నట్టు ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే, విజయవాడ ఆర్చర్‌ సురేఖకు ప్రపంచ కప్‌లో ఇది 11వ పసిడి పతకం.

➡️