ముంబయి రంజీ జట్టులో సూర్యకుమార్‌, దూబే

ముంబయి: హర్యానాతో 8నుంచి జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముంబయి 18 మందితో జట్టును ప్రకటించింది. వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ముంబయి సెలెక్టర్లు భారత టి20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ శివమ్‌ దూబేను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారతజట్టుకు ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌, రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ పేర్లను ముంబయి సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ముంబయి జట్టులో యువ బ్యాటర్లు ఆయుశ్‌ మాత్రే, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, సిద్దేశ్‌ లాడ్‌, బౌలింగ్‌ అటాక్‌ను శార్దూల్‌ లీడ్‌ చేస్తాడు.
జట్టు: రహానే(కెప్టెన్‌), ఆయుషీ మంత్రే, రఘువంశీ, భక్తల్‌, సూర్యకుమార్‌, శిద్ధేశ్‌ లాడ్‌, శివమ్‌ దూబే, ఆకాశ్‌ ఆనంద్‌, హార్దిక్‌ టమోర్‌(వికెట్‌ కీపర్లు), సూర్యాంశ్‌ షిండే, శార్దూల్‌ ఠాకూర్‌, శామ్స్‌ ములాని, తనుష్‌ కొటియన్‌, మోహిత్‌ అవస్థీ, సిల్వెస్టర్‌, రోస్టర్‌ డియాస్‌, అంకొలేకర్‌, హర్ష్‌ తన్నా.

➡️