- లక్ష్యసేన్, అశ్విని-తనీశ జోడీ సైతం
- సయ్యద్ మోడీ ఇండియా ఓపెన్
లక్నో (ఉత్తరప్రదేశ్) : భారత అగ్రశ్రేణి షట్లర్ పివి.సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ మహిళల సింగిల్స్‌లో సింధు జోరు కొనసాగించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో చైనా అమ్మాయి వాంగ్‌పై 21-15, 21-17తో వరుస గేముల్లో గెలుపొందిన సింధు సెమీస్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ లక్ష్యసేన్ సైతం సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. సహచర షట్లర్ లువాంగ్‌పై 21-8, 21-19తో ఏకపక్ష విజయం సాధించాడు. మరో క్వార్టర్స్‌లో ప్రియాన్షు రజావత్ 21-13, 21-8తో డాంగ్‌పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టాడు. మహిళల డబుల్స్‌లో తనీశ క్రాస్టో, అశ్విని పొన్పప్ప జోడీ 21-12, 17-21, 21-16తో ప్రియ, శృతి జోడీపై మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందింది. మరో క్వార్టర్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి 21-8, 21-15తో వరుస గేముల్లో మలేషియా జోడీపై అలవోక విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, తనీశ క్రాస్టోలు 21-16, 21-13తో మలేషియా జంటపై గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకున్నారు.