లక్నో (ఉత్తరప్రదేశ్) : సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు టైటిల్ పోరుకు చేరుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-12, 21-9తో వరుస గేముల్లో అలవోక విజయం సాధించింది. సహచర భారత షట్లర్ ఉన్నతి హుడా నుంచి సింధుకు పెద్దగా పోటీ ఎదురు కాలేదు. నేడు ఫైనల్లో చైనా షట్లర్ వు యుతో సింధు తలపడనుంది. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జోడీ 18-21, 21-18, 21-10తో మూడు గేముల మ్యాచ్‌లో థారులాండ్ జోడీపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ, సాయి ప్రతీక్ 21-17, 17-21, 21-16తో ఇషాన్, శంకర్‌లపై విజయం సాధించి టైటిల్ పోరులో అడుగు పెట్టారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల్, తనీశ క్రాస్టో జంట సైతం 21-16, 21-15తో వరుస గేముల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌లో ప్రియాన్షు రజావత్ 13-21, 19-21తో పరాజయం పాలయ్యాడు. టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-8, 21-14తో జపాన్ షట్లర్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు.