హైదరాబాద్ :
- సంజు శాంసన్ 40బంతుల్లో 8సిక్సులు, 9ఫోర్లతో సెంచరీ సాధించారు. 13ఓవర్లకు 190/1
- హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దసర సంబరాలు వేడుకలా సాగుతుంది భారత్ బ్యాటర్ల ఆట. బంగ్లాదేశ్ బౌలర్లను భారత్ బ్యాటర్లు చీల్చిచండాడుతున్నారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి 11ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 161పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు విరుచుకుపడుతుంది. తాజాగా టీంలో మార్పు చోటుచేసుకుంది. పేసర్ అర్ష్‌దీప్ స్థానంలో రవి బిష్ణోయ్‌కి అవకాశం దక్కింది. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా హర్షిత్ రాణా మూడవ టీ20కి హాజరుకాలేదు. సంజు శాంసన్ 40బంతుల్లో 8సిక్సులు, 9ఫోర్లతో 100 పరుగులతో, సూర్యకుమార్ 30బంతుల్లో 5సిక్సులు, 6ఫోర్లతో 65 పరుగులతో దూసుకుపోతున్నారు.
భారత్ జట్టు : సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మే బిక్నోరి, రవిష్ణోరి యాదవ్..