T20 Women’s World Cup : నేడు హర్మన్‌ప్రీత్‌ సేన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌

  • టి20 మహిళల ప్రపంచకప్‌ టోర్నీ

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) టి20 మహిళల ప్రపంచకప్‌ మరో మూడు రోజుల ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నీకి ముందు ప్రధాన జట్లు రెండేసి చొప్పున ప్రాక్టీస్‌ మ్యాచుల్లో తలపడనుంది. యుఎఇ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 30 వరకు జరిగే టోర్నీలో మొత్తం 12జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎలో ఉన్న భారతజట్టు.. మిగిలిన 5జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడనుంది. లీగ్‌ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో రెండుజట్లు సెమీస్‌కు చేరనున్నాయి. భారతజట్టు తన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను గ్రూప్‌-బిలో ఉన్న వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. ఇక ప్రధాన టోర్నీలో భాగంగా భారత్‌ తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో శుక్రవారం(అక్టోబర్‌ 4న) తలపడనుంది.

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు..
28(శని) : పాకిస్తాన్‌ × స్కాట్లాండ్‌
బంగ్లాదేశ్‌ × శ్రీలంక
29(ఆది) : న్యూజిలాండ్‌ × దక్షిణాఫ్రికా
ఇండియా × వెస్టిండీస్‌
ఆస్ట్రేలియా × ఇంగ్లండ్‌
30(సోమ) : స్కాట్లాండ్‌ × శ్రీలంక
బంగ్లాదేశ్‌ × పాకిస్తాన్‌
అక్టోబర్‌1 : ఆస్ట్రేలియా × వెస్టిండీస్‌
ఇంగ్లండ్‌ × న్యూజిలాండ్‌
ఇండియా × దక్షిణాఫ్రికా

➡️