T20 World Cup 2024 : ఒమన్‌పై స్కాట్లాండ్‌ గెలుపు

Jun 10,2024 21:54 #Sports, #T20 world cup
  • సూపర్‌-8 దిశగా స్కాట్లాండ్‌..

ఆంటిగ్వా: గ్రూప్‌-బి నుంచి స్కాట్లాండ్‌ జట్టు సూపర్‌-8 దిశగా పయనిస్తోంది. ఆదివారం రాత్రి ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 150పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ జట్టు 13.1ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి 153పరుగులు చేసి ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్‌ బ్యాటర్‌ మెక్‌ ముల్లెన్‌(61నాటౌట్‌; 31బంతుల్లో) విధ్వంస ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అంతకుముందు స్కాట్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఒమన్‌ జట్టు 150పరుగులకే పరిమితమైంది. ఒమన్‌ 8.5ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 71పరుగులు చేసి పటిష్టంగా ఉన్నా.. ఆ తర్వాత స్కాట్లాండ్‌ బౌలర్లు సమిష్టిగా చెలరేగారు. స్కాట్లాండ్‌ బౌలర్‌ సఫ్యాన్‌ షరీఫ్‌(2/40) పరుగులు ధారాళంగా సమర్పించుకొన్నా.. రెండు వికెట్లు కూల్చి రాణించాడు. వాట్‌, వీల్‌, సోలే, గ్రీవ్స్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మెక్‌ ములానీకి లభించింది.

➡️