తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 8 రోజుల పర్యటన కోసం స్పెయిన్ వెళ్లారు. అయితే, స్పెయిన్ వెళుతుండగా విమానంలో ఆయనకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కనిపించాడు. దాంతో, స్వయంగా వెళ్లి జకోవిచ్‌ను పలకరించారు. ‘ఆకాశవీధిలో ఆశ్చర్యకరమైన కలయిక’ అంటూ స్టాలిన్ దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
