ఫైనల్‌కు తమిళనాడు, కర్ణాటక

Jan 9,2025 23:07 #Sports, #vallyball
  • జాతీయ అండర్‌-19 బాలికల వాలీబాల్‌ టోర్నీ

ప్రజాశక్తి-విజయవాడ స్పోర్ట్స్‌ : పి బి సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న 68వ స్కూల్‌ గేమ్స్‌ జాతీయ అండర్‌-19 బాలికల వాలీ బాల్‌ పోటీల్లో తమిళనాడు, కర్నాటక జట్టు ఫైనల్స్‌కు చేరుకున్నాయి తొలి సెమీఫైనల్లో తమిళనాడు జట్టు హర్యా నాపై 3-0 (25-14,25-12, 25-16)తో వరుస సెట్లలో విజయాన్ని సాధిం చింది. తమిళనాడు జట్టులో సాధన, మౌని హ, పవిత్ర అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌ పోటీలో కర్ణాటక 3-0 (25-18, 25-16, 25-22) స్కోర్‌తో కేరళపై గెలుపొందింది. కర్ణాటక క్రీడాకారిణులు అద్భుతమైన డిఫెన్స్‌ ఆటతీరు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కరళ అటాకింగ్‌లో రాణించినా కర్ణాటక డిఫెన్స్‌తో కట్టడి చేసింది. మొదటి రెండు సెట్లను కర్ణాటక అలవోకగా గెలిచినా మూడోసెట్‌ గెలవడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. కర్ణాటక జట్టులో లీబ్రో అన్విత డిఫెన్స్‌లో, దిశ, హులిగమ్మ, ధవి అటాకింగ్‌ లో అద్భుతమైన ఆటతో జట్టుకు విజయాన్ని చేకూర్చారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు హర్యానా, కేరళ జట్ల మధ్య తతీయ స్థానం(కాంస్య పతకం)కోసం 10 గంటలకు, తమిళనాడు, కర్ణాటక జట్ల మధ్య ఫైనల్స్‌ పోటీ జరుగుతుందని చీఫ్‌ రిఫరీ డి. దయాకర్‌ తెలిపారు.

➡️