ప్రి క్వార్టర్స్‌కు తానీషా-ధృవ్‌

  • ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

జకార్తా: ఇండోనేషియా వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తానీషా-ధృవ్‌ కపిల సత్తా చాటారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో వీరు 21-18, 21-14తో ఇండోనేషియాకే చెందిన జామిల్‌-ములానాను చిత్తుచేశారు. మరో పోటీలో ఆర్‌ కపూర్‌-గద్దె జంట 9-21, 13-21తో ఇంగ్లండ్‌ జంట చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. తొలిరౌండ్‌లో పివి సింధు 20-22, 12-21తో న్యూయెల్‌(వియత్నాం) చేతిలో, అనుపమ ఉపాధ్యాయ 12-21, 5-21తో టంగ్‌జంగ్‌(ఇండోనేషియా) చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు. మరో పోటీలో హేమంత్‌ 14-21, 11-21తో 13వ ర్యాంకర్‌ ఇంటనాన్‌(థారులాండ్‌) చేతిలో, ఆర్‌.రామ్‌రాజ్‌ 17-21, 19-21తో మియాజికి(జపాన్‌) చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు.
ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రాజ్‌వత్‌ మూడుసెట్ల హోరాహోరీ పోరులో నరాకో(జపాన్‌) చేతిలో పోరాడి ఓడాడు. హోరాహోరీగా సాగి ఈ మ్యాచ్‌లో ప్రియాన్షు 14-21, 21-13, 18-21తో నరోకా చేతిలో ఓడాడు. ఇక కిరణ్‌ జార్జి 12-21, 10-21తో లియాంగ్‌(మలేషియా) చేతిలో , అస్మిత్‌ శెట్టి 19-21, 19-21తో వై.క్యూ.షి(చైనా) చేతిలో పోరాడి ఓడాడు.

➡️