- రేపటినుంచి ప్రెసిడెంట్స్ ఎలెవెన్‌తో రెండ్రోజుల మ్యాచ్
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ భారత క్రికెట్ బృందానికి గురువారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు పరిచయం చేశారు. పెర్త్ టెస్టులో విజయం సాధించిన భారత క్రికెటర్లను అల్బనీస్ ప్రశంసించారు. బుమ్రా, కోహ్లీని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. మరోవైపు నవంబర్ 30నుంచి ప్రైమ్ మినిస్టర్ లెవన్ జట్టుతో టీమిండియా రెండు రోజుల పింక్ బాల్ ప్రాక్టీసు మ్యాచ్ ఆడనుంది. మనూకా ఓవల్ మైదానంలో ఆ మ్యాచ్ జరగనుండగా.. డిసెంబర్ 6 నుంచి ప్రారంభంకానున్న రెండవ టెస్టుకు.. ఇది ప్రాక్టీస్ మ్యాచ్ దోహదపడనుంది. జాక్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని ప్రైమ్ మినిస్టర్స్ లెవన్ జట్టు కూడా ప్రధాని ఆల్బనీస్‌ను కలిసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారతజట్టు పెర్త్ వేదికగా జరిగిన తొలిటెస్ట్‌లో ఏకంగా 295పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. దీంతో టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యతలోనూ నిలిచింది.