- ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో సిరీస్..
ముంబయి: 2025 ఏడాదిలో టీమిండియా బిజీ.. బిజీ.. షెడ్యూల్‌తో గడపనుంది. ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా జట్టు స్వదేశంలో జనవరి 22నుంచి ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు సిద్ధమైంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్‌లో జరగనున్న దృష్ట్యా ఇంగ్లండ్‌తోనూ మూడు వన్డేల సిరీస్‌ను భారత్ సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్‌కు ఇరుదేశాల క్రికెట్‌బోర్డులు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. ఆ తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. అది జూన్‌లో లార్డ్స్ వేదికగా ఉంటుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బాక్సింగ్ డే టెస్ట్‌లో ఓడిన టీమిండియా.. 11ఏళ్ల తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు మరోసారి చేరే ఛాన్స్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యుటిసి ఫైనల్స్‌కు ఇప్పటికే అర్హత సాధించగా.. రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక జట్లు రేసులో ఉన్నాయి. సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ఆస్ట్రేలియాతో ఐదో, చివరి టెస్ట్‌లో భారత్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబారు వేదికగా జరగనున్నాయి. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీలో టీమిండియా ఒకవేళ నాకౌట్‌కు చేరితే ఆ మ్యాచ్‌లు కూడా దుబారులోనే ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన పిమ్మట భారత్ వేదికగా ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్ మార్చి 14నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత టీమిండియా జూన్-ఆగస్ట్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు టిలు, మరో మూడు వన్డేల్లో.. అక్టోబర్ 25నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మూడు ఫార్మాట్‌లలోనూ తలపడాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది భారత్ ఐసిసి సభ్యత్వ దేశాలతో బిజీ.. బిజీ.. షెడ్యూల్‌తో గడపనుంది.
ఇంగ్లండ్‌తో టి20 సిరీస్…
జనవరి 22 : తొలి టి20(చెన్నై)
జనవరి 25 : రెండో టి20(కోల్‌కతా)
జనవరి 28 : మూడో టి20(రాజ్‌కోట్)
జనవరి 31 : నాల్గో టి20(పూణే)
ఫిబ్రవరి 2 : ఐదో టి20(ముంబయి)
వన్డేలు..
ఫిబ్రవరి 6 : తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9 : రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12 : మూడో వన్డే(అహ్మదాబాద్)
———-
ఛాంపియన్స్ ట్రోఫీ : ఫిబ్రవరి – మార్చి
ఐపిఎల్ : మార్చి 14నుంచి మే 25వరకు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్: జూన్ 2025(భారత్ అర్హత సాధిస్తేనే..)
ఇండియా × ఇంగ్లండ్ : జూన్-ఆగస్టు (5టెస్టులు)
తొలి టెస్ట్ : జూన్ 20-24(హెడ్డింగ్లీ)
రెండో టెస్ట్ : జులై 2-6(ఎడ్జ్‌బాస్టన్)
మూడో టెస్ట్ : జులై 10-14(లార్డ్స్)
నాల్గో టెస్ట్ : జులై 23-27(మాంచెస్టర్)
ఐదో టెస్ట్ : జులై 31-ఆగస్టు4(ఓవల్)
ఆగస్టు : టీమిండియా బంగ్లా పర్యటన (3వన్డేలు, 3టి20లు)
అక్టోబర్ : విండీస్ ఇండియా పర్యటన (2టెస్టులు)
అక్టోబర్-నవంబర్ : భారత్ వేదికగా ఆసియాకప్(టి20)
నవంబర్ : భారతజట్టు ఆస్ట్రేలియా పర్యటన(3వన్డేలు, 5టి20లు)
నవంబర్-డిసెంబర్: దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటన(2టెస్టులు, 3వన్డేలు, 3టి20లు)